Pawan Kalyan will do a Voice Over for Ram Charan Yevadu. The movie
release being planned for June 14th, the first wedding anniversary of
Ram Charan and Upasana. Yevadu written and directed by Vamsi Paidipally.
Music is being composed by Devi Sri Prasad.
హైదరాబాద్: ఈ మధ్య పలు సినిమాలకు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఓ ట్రెండ్‌గా మారింది. తాజాగా రామ్ చరణ్ సినిమాలో కూడా ఇలాంటి ఎక్సపర్మెంట్ చేస్తున్నారు.
రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎవడు' చిత్రానికి చెర్రీ బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ ‘జల్సా' చిత్రానికి మహేష్ బాబు, ‘దేనికైనా రెడీ' చిత్రానికి ప్రభాస్, ‘మర్యాద రామన్న' చిత్రానికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తాజాగా బాద్ షా చిత్రానికి కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ ‘ఎవడు' చిత్రానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆసక్తి కరంగా మారింది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రామ్ చరణ్-ఉపాసన మొదటి పెళ్లి రోజైన జూన్ 14వ తేదీన ‘ఎవడు' చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా ‘ఎవడు' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
అంతే కాక జగదేక వీరుడు- అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంవటి మెమోరెబల్ సినిమాల విడుదలైన రోజైన మే 9వ తేదీన ‘ఎవడు' చిత్రం ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజునుమార్చి 27) పురస్కరించుకుని ‘ఎవడు' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

No comments:
Post a Comment